Ugadi 2022 Wishes, Quotes, Messages, Whatsapp Status, Images in Telugu: ఉగాది పండుగ ప్రత్యేకత.. ఏమేం చేయాలి? శుభాకాంక్షలు ఇలా చెప్పండి.. లేదామీ బంధువులను ఆకట్టుకునేందుకు ఉగాది విషేష్.. ఇలా చెప్పండి.. లేదా ఉగాది శుభాకాంక్షలు ఎలా చెప్పాలో తెలుసా..?
ఉగాది.. తేటతెలుగు వారి స్వచ్ఛమైన పండుగ.. తెలుగు వారి కొత్త సంవత్సరాది కూడా.. ఇప్పటి నుంచి మన తెలుగు పండుగలు, నెలలు మొదలవుతాయన్న సంగతి చాలా మందికి తెలియదు. ఈ అచ్చతెలుగు పండుగ వచ్చిదంటే చాలు.. మామిడి తోరణాలు.. ఇళ్లంతా కడిగి కల్లాపి చల్లి, పసుపు పెట్టి.. వేప పువ్వు, కొత్త చింతపండు , మామిడి కాయలను తీసుకొచ్చి కొత్తకుండలో వేసి పచ్చడి తయారు చేసుకొని తాగేవాళ్లం.. బచ్చాలు, బూరెలు చేసుకొని తినేవాళ్లం.. కరోనా కారణంగా రెండేళ్లు పండుగను సరిగా చేసుకోలేదు. ఈ సంవత్సరం కరోనా తగ్గడంతో ఉగాదికి కళ వచ్చింది.
Ugadi Telugu 2022: ప్రపంచం మొత్తం జనవరి 1వ తేదీతోనే కొత్త సంవత్సరం ఆరంభం అవుతుంది .. పాశ్చాత్య సంస్కృతితో పడిపోయి కొట్టుకుంటున్న మనం ఈ ఇంగ్లీష్ సంవత్సరాన్నే ఫాలో అవుతున్నాం. కానీ మన తెలుగు రాష్ట్రాలు, కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఉగాదితోనే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. షడ్రుచుల సమ్మేళనం.. కొత్త పంచాంగంతో సంబరాలు చేసుకునే ఉగాది నాడు తెలుగు ప్రజలు ఎంతో సంతోషంగా గడుపుతారు. ప్రకృతి సైతం ఉగాది పండుగ సమయంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. వసంత రుతువులో పాత ఆకులన్నీ రాలి కొత్త ఆకులతో పచ్చదనం పరుచుకుంటుంది. తేమతో నిండిన చల్లటి గాలి ఉగాదికి స్వాగతం పలుకుతుంది. కొత్త చింతపండు, కొత్త వేప పువ్వు, మామిడి కాయలు పుల్లటి రుచిని అందిస్తాయి. ఉగాది సందర్భంగా ఒకరినొకరు పచ్చడి ఇచ్చుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. కొందరు భక్ష్వాలు చేసుకొని ఆరగిస్తారు. 2022 సంవత్సరంలో ఏప్రిల్ 2న ఉగాది పండుగ రానుంది. ఈసారి ‘‘శ్రీ శుభకృత నామ సంవత్సరం’’గా ప్రారంభం కానుంది.
ఉగాది రోజున అసలు ఏం చేయాలి.? ఏమైనా చేయకూడనివి ఉన్నాయా.. లేదా ఖచ్చితంగా చేయాల్సినవి ఉన్నాయా.? ఇలాంటి ప్రశ్నలు అందరి మదిని తొలుస్తుంటాయి. ఉగాది రోజున ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి, సూర్యదోయానికి పూర్వమే తలకు నూనె రాసుకొని తలస్నానం చేయాలి. పండుగ దినాల్లో నూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి ఉంటారని పెద్దలు చెబుతారు. అందుకే ఉగాది రోజున లక్ష్మీదేవి కటాక్షానికి గంగమ్మ కరుణకు పాత్రులయ్యే విధంగా ఈరోజున ఇలా చేయాలని చెబుతారు. ఇక తలస్నానం చేసిన తర్వాత కొత్త బట్టలు కట్టుకొని ఇంటిని శుభ్రపరుచుకొని మామిడాకులతో అలంకరించుకొని గడపకు పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టుకోవాలి.
భక్తి శ్రద్ధలతో ఇష్టదైవాన్ని పూజించుకోవాలి. తులసి చెట్టుకు పూజ చేసుకోవడం అత్యంత శుభప్రదం. లక్ష్మీదేవికి , విష్ణు దేవునికి తులసీమాల సమర్పించడం శ్రేయస్కరం. ఇక షడ్రులతో చేసిన ఉగాది పచ్చడి నైవేద్యం సరేసరి. పూజ పూర్తయిన తర్వాత మన అహాన్ని విసర్జిస్తూ , సర్వేశ్వరునికి సాష్టాంగపడి నమస్కరించాలి.
పూజావిధానం భక్తిశ్రద్ధలతో చేసిన పిదప, పంచాంగశ్రవణం చేసుకోవాలి. లేదా పంచాంగ శ్రవణం విన్నా అద్భుత ఫలితాలుంటాయి. ఎవరెవరి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత నైవద్యంగా పెట్టిన ఉగాది పచ్చడిని భుజించాలి. ప్రపంచంతో పాటు, మనమూ సుఖంగా, క్షేమంగా ఉండాలని.. అందరూ బాగుండాని, అందరిలో మనముండాలని భగవంతుడిని ప్రార్థించి ఉగాది కొత్త ఆశలకు చిగురువేయాలని కోరుకోవాలి.
ఉగాది అంటే అది తెలుగువారి పండుగ.. వివిధ భాషలు వేరైనా.. ప్రతి రాష్ట్రంలోనూ ఈ కొత్త సంవత్సరం పండుగను జరుపుకుంటారు. ఉగాది పండుగను దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లతో జరుపుకుంటారు. చిన్న పాటి తేడాలున్నా కూడా మొత్తంగా కొత్త సంవత్సరంగా జరుపుతారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రజలకు ఈ ఉగాది పండుగ ఉంది. నేటి నుంచి కొత్త తెలుగు సంవత్సరాన్ని లెక్కిస్తారు. షడ్రుచుల సంగమమైన ఉగాది పచ్చడి సేవిస్తారు.
ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ గతి తప్పింది. ఒకరోజు అటూ ఇటూగా వచ్చింది. పండుగ ఎప్పుడు జరుపుకోవాలన్న దానిపై తర్జన భర్జన పడుతున్నారు. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు అనంతమైన విశ్వాన్ని ఉగాది రోజునే అంటే చైత్ర మాసం శుక్ల పక్షం పాఢ్యమి రోజునే సృష్టించాడని పురణాలు చెబుతున్నాయి. ఈరోజు నుంచే ఈ లోకం ప్రారంభమైందని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఈ ఏడాది ఉగాదిని ఏప్రిల్ 2 శనివారంగా చాలా మంది నిర్ణయించారు. కానీ కొంతమంది 3వ తేదీగా కూడా సూచిస్తున్నారు. ఇంకొందరు 1వ తేదీగా జరపాలని అంటున్నారు. వివిధ పండితులు, పంచాంగకర్తల మధ్య క్లారిటీ లేకపోవడంతో మెజార్టీ వాసులు 2వ తేదీ జరుపుకోవాలని అంటున్నారు.
ఉగాది పండగ శుభాకాంక్షలను ఎలా చెప్పాలో చాలా మందికి తెలియదు. ఈ కింద ఉన్న కోటేషన్స్ (Quotes) ద్వారా ఉగాది శుభాకాంక్షలు(Ugadi Wishes) చెప్పి ఆకట్టుకోండి..
మధురమైన ప్రతిక్షణం నిలుస్తుంది జీవితాంతం..
రాబోతున్న కొత్త సంవత్సరం అలాంటి క్షణాలెన్నో అందించాలని ఆశిస్తూ..
శ్రీ శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
శ్రీ శుభకృత నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఉగాది శుభాకాంక్షలు.
లక్ష్మీదేవి మీ ఇంటికి చేరాలని..
ఎలాంటి వ్యాధులు మీ దరి చేరకూడదని..
అందరికీ మంచి జరగాలని.. కోరుకుంటున్నా..
జీవితం సకల అనుభూతుల నమ్మిశ్రమం.
స్థిత ప్రజ్ఒత అలవరుచుకోవడం వివేకుల లక్షణం..
ఈ ఉగాది మీకు తెలిపే సందేశమిదే
మీకు, మీ కుటుంబ సభ్యులకు
శ్రీ శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
ఈ ఉగాది రోజున ఇంట్లోనే ఉందా.. ఆనందంగా.. ఆరోగ్యంగా గడుపుదాం..
బంధువులు, స్నేహితులను సైతం ఆరోగ్యంగా ఉంచుదాం..
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
వసంతం మీ ఇంట రంగవల్లులు అద్దాలి..
కోకిల మీ అతిథిగా రావాలి..
కొత్త చిగురులు ఆశల తోరణాలు కట్టాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు
శ్రీ శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
షడ్రుచుల సమ్మేళన జీవితం..
కష్ట,సుఖం, పాపం, పుణ్యం, మంచి, చెడుల కలయిక ఈ జీవితం..
అందరికీ శ్రీ శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
Web Title: Ugadi 2022 wishes quotes messages whatsapp status images in telugu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com